రంగ్ రేజ్ జీన్స్ అండ్ టీ షర్ట్స్.

0
3

రంగ్ రేజ్ జీన్స్ అండ్ టీ షర్ట్స్.

ఈ రోజుల్లో  రోజుకో కొత్త ఫ్యాషన్ వస్తుంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. హెయిర్ స్టైల్స్ , డ్రెస్ మోడల్స్  ఇలా ఎన్నో  రకాల ఫ్యాషన్ ఐటమ్స్  వస్తూనే ఉన్నాయి . వీటిలో  భారతీయ హస్తకళలు ఉట్టిపడేలా హ్యాండ్ పెయింటెడ్ జీన్స్ ఇంకా టీ షర్ట్స్ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయి .

చేతితో వేసే ఏ పెయింట్ అయినా అందంగానే ఉంటుంది. అదే పెయింట్ ని మనం వేసుకునే బట్టల మీద చూసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. హస్తకళల సౌందర్యం కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ మార్కెట్ లో బోలెడన్ని డిజైన్స్ తో హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి ఈ రంగ్ రేజ్ జీన్స్ అండ్ టీ షర్ట్స్.

చేతితో వేసిన కథాకళి ముఖం ఉన్న ఈ  టీ షర్ట్స్ కాలేజీ కి వెళ్ళే అమ్మాయిలకి చాల బాగా నప్పుతాయి. ఎప్పుడు మాములు టీ షర్ట్స్ వేసుకుని వెళుతూ ఒక్కోసారి ఈ రకం హ్యాండ్ ప్రింట్ వి వేసుకుంటే చాలా చేంజ్ కనిపిస్తుంది.

ఆరంజ్ కలర్ టీ షర్ట్ మీద కలశం నెత్తి మీద పెట్టుకున్న అమ్మాయి పెయింటింగ్ మనకి నిర్మలా పెయింటింగ్స్ ని గుర్తుచేస్తుంది. చూడటానికి ముదురు రంగులతో నిండి ఉన్న ఈ చిత్రం చూపరులని కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది.

జీన్స్ లో కూడా వెరైటీ డిజైన్స్ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఎప్పుడూ ప్లెయిన్ గా కనపడే జీన్స్ మీద కూడా రకరకాల పెయింటింగ్స్ ఉండడంతో ఇవి ఫాషన్ కి మారుపేరుగా మారుతున్నాయి. నెమలిపింఛమ్ పెయింటింగ్ ఉన్న జీన్స్ ఎక్కువగా సేల్ అవుతోందని ఒక టాక్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here