తెల్లజుట్టు సమస్య అధిగమించడానికి హోంమేడ్ హెయిర్ డై..!

0
1

తెల్లజుట్టు సమస్య అధిగమించడానికి హోంమేడ్ హెయిర్ డై..!

తెల్లజుట్టు సమస్య ఒకరిది కాదు ఇద్దరిది కాదు.. టీనేజర్స్ నుంచి.. వయసు పెరుగుతున్న వాళ్ల వరకూ అందరిలోనూ కనిపిస్తున్న కామన్ ప్రాబ్లమ్. దీన్ని అధిగమించడానికి రకరకాలుగా ప్రయత్నించి.. చివరికి సైలెంట్ అయిపోతున్నారు. మార్కెట్ లో దొరికే హెయిర్ డై స్ ప్రయత్నించి.. అవి వారానికే జుట్టు రంగుని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడం వల్ల.. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉంటున్నారు.
ఉసిరి

ఉసిరి  తెల్ల జుట్టుని న్యాచురల్ బ్రౌన్ లేదా రెడ్ కలర్ లోకి తీసుకొస్తుంది. అలాగే జుట్టుకి న్యాచురల్ షైనింగ్ ఇస్తుంది. కాబట్టి ఉసిరికాయ పౌడర్ ని నీళ్లు కలిపి పేస్ట్ ని తలకు పట్టించాలి. గంట తర్వాత శుభ్రం చేసుకుంటే.. జుట్టు రంగు మారుతుంది.

కొబ్బరినూనె

6 నుంచి 8 టీస్పూన్ల కొబ్బరి నూనె తీసుకోవాలి. మూడు టీ స్పూన్ల తాజా నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి.. గంట తర్వాత మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

టీ

కాఫీ, టీ రెండింటిలోనూ జుట్టుకి కలర్ తీసుకొచ్చే సత్తా ఉంటుంది. టీ పౌడర్ లేదా టీ బ్యాగ్స్ తీసుకుని.. బాగా ఉడకిన తర్వాత వడకట్టాలి. ఈ డికాషన్ ని జుట్టుకి అప్లై చేసి.. కొన్ని గంటల తర్వాత శుభ్రం చేసుకుంటే.. ఫలితాలు మీరే చూస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here