రోబో 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్

0
3

రోబో 2.0 రిలీజ్ డేట్ ఫిక్స్

సూపర్ స్టార్ రజనీ కాంత్ , డైరెక్టర్ శంకర్ కాంబినేషన్  లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం రోబో  . ఈ సినిమాకు సీక్వెల్ గా 2.0 ని నిర్మించిన విషయం తెలిసిందే .  రోబో 2.0 సినిమా షూటింగ్ పూర్తయ్యి చాలా కాలం అయింది. ఇక ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు ఆలస్యం కావడంతో.. సినిమా  రిలీజ్ విషయం పై ఒక క్లారిటీ రాలేదు.

ఈ రోజు  సినిమా రిలీజ్ డేట్ ను  ప్రకటించింది చిత్ర యూనిట్ .  నవంబర్ 29 న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు శంకర్ అధికారికంగా ట్విట్టర్ ద్వారా  ప్రకటించాడు.  ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాకోసం దాదాపుగా రూ.500 కోట్లు ఖర్చు చేసింది.  రోబో హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

 

బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా  నటించాడు.  తెలుగు, తమిళ్ తో సహా మొత్తం 15 భాషలలో 2డి, 3డి ఫార్మెట్ లో 2.0 విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here