బయోపిక్ కోసం సంజయ్ ఎంత తీసుకొన్నాడో తెలుసా ?

0
4

బయోపిక్ కోసం సంజయ్ ఎంత తీసుకొన్నాడో తెలుసా ?

బాలీవుడ్ లో బయోపిక్ పేరుతో వచ్చిన  చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి . దంగల్, ధోని, సచిన్, పద్మావతి చిత్రాలు బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్స్  గా నిలిచాయి .

ప్రస్తుతం బొల్లూవుడ్ లో మరో బయోపిక్ సినిమా హవా  నడుస్తుంది . సంజయ్ దత్ జీవిత కథ  ఆధారంగా ఒక సినిమా విడుదలై కోట్లు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే .

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో  యంగ్ హీరో రణ్ బీర్ సింగ్ హీరోగా  రూపొందిన చిత్రం ‘సంజు.  జూన్ 29 న విడుదలైన ఈ చిత్రం అతి తక్కువ సమయంలో 100కోట్ల క్లబ్ లో చేరిపోయింది.  ప్రస్తుతం  రూ. 250కోట్లు దాటిపోయింది. సంజయ్ జీవితం గురించి సినిమా చూసి తెలుసుకోవాలన్న ప్రేక్షకుల ఆతృత ‘సంజు’కి వరంగా మారింది.

మరోవైపు, తన బయోపిక్ కోసం సంజయ్ ఎంత తీసుకొన్నాడు ? అనే చర్చ కూడా మొదలైంది. ఈ సినిమా ప్రారంభించే ముందే  సంజయ్ రూ. 10కోట్లు ఇచ్చినట్లు సమాచారం .ఇదిగాక, సినిమా లాభాల్లో వాటా ఇస్తామని ఒప్పుకొన్నారు. ఇచ్చారు కూడా. మొత్తంగా తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ ద్వారా సంజయ్ కు రూ. 20కోట్లు ముట్టినట్టు సమాచారమ్.

లాభాలు పెరిగే కొద్దీ.. అది ఇంకా పెరగనుందని చెబుతున్నారు. తన జీవితంగాధ తెరపై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం.. లాభాలు కురిపించడం పట్ల సంజయ్ హ్యాపీగా ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here