ఎయిర్‌టెల్ న్యూ ప్లాన్

0
1

ఎయిర్‌టెల్ న్యూ ప్లాన్

ప్రస్తుతం  టెలికాం రంగంలో అన్ని కంపెనీల మధ్య పోటీ ఏర్పడింది . ఈ విధంగా  ఏర్పడిన పోటీ కారణంగా అన్ని ప్రైవేట్ టెలికాం కంపెనీలు ధరలను గణనీయంగా తగ్గిస్తున్నాయి.

ముఖ్యంగా, జియో, ఎయిర్‌టెల్ కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. జియో ఆఫ్లకు పోటీగా ఎయిర్‌టెల్ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఇందులోభాగంగా, తాజాగా మరో ఆఫర్‌ను ఎయిర్‌టెల్ ప్రకటించింది.

కేవలం రూ.149కే 28 రోజుల పాటు ప్రతీ రోజు 2జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్ చేసింది. అయితే, ప్రస్తుతం కొన్ని సర్కిళ్లలోనే ఈ ప్లాన్ అమల్లోకి రాగా, త్వరలో అన్ని సర్కిళ్లలోకి రానుందని మార్కెట్ వర్గాల సమాచారం. గతంలో ఈ ధరకే కేవలం ప్రతి రోజూ ఒక జీబీ డేటానే ఆఫర్ చేస్తూ వచ్చిన విషయం తెల్సిందే.
రిలయన్స్ జియో రూ.149 రీచార్జ్ చేసుకున్న వారికి ప్రతి రోజూ 1.5 జీబీ 4జీ డేటాను 28 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. దీనికి పోటీగా ఎయిర్‌టెల్ ప్రతి రోజూ అదనంగా మరో అర జీబీ డేటాతో మొత్తం 2జీబీ డేటాతో కూడిన ప్లాన్‌ను తీసుకొచ్చినట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల కస్టమర్లు చేజారిపోకుండా ఉంటారని, కొత్త కస్టమర్లను ఆకర్షించొచ్చని ఎయిర్‌టెల్ భావిస్తోంది.
కాగా, దేశీయ టెలికాం రంగంలోకి రిలయన్స్ జియో రెండేళ్ల క్రితమే మార్కెట్లోకి అడుగు పెట్టినప్పటికీ కస్టమర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటూ వెళుతోంది. దీంతో మార్కెట్లో టాప్ ప్లేయర్స్‌గా ఉన్న ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్‌పై గట్టి ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో పోటీ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఆకర్షణీయ ప్లాన్లను ప్రకటిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here