చుండ్రు నివారణ చిట్కాలు   

0
3

చుండ్రు నివారణ చిట్కాలు

ప్రస్తుత కాలంలో జుట్టు రాలడంతోబాటు , చుండ్రు మరో ప్రధాన సమస్యగా మారింది. సరైన పోషకాహారం తీసుకోకపోవడం, జుట్టును ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఇన్‌ఫెక్షన్‌

చుండ్రు రావడానికి గ కారణాలు.

 ఈ  చిట్కాలను పాటించడం ద్వారా  చుండ్రు నివారించవచ్చు.

1.మెంతులు జుట్టు పెరుగుదలకు ఎంతో దోహదపడతాయి.మెంతులలో యాంటీ ఫంగల్ గుణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి ఇది చుండ్రుని నివారించడంలో పవర్ ఫుల్‌గా పనిచేస్తుంది.4 టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయం వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలకు మరియు కేశాలకు బాగా పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈవిధంగా నాలుగు వారాల పాటు క్రమం తప్పకుండా పాటించడం వలన చుండ్రు సమస్యలను నివారించవచ్చు.
2.వేపాకు ఆకులను మిక్సీలో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసి,ఆ మిశ్రమాన్ని  తలకు బాగా పట్టించాలి.  ఒక గంట తర్వాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.
3.ఒక పాత్రలో కొన్ని నీరు తీసుకొని నీళ్ళు మరిగాక అందులో వేపాకులను వేయాలి . ఆకులను నీటిలో రాత్రంతా అలానే నాననివ్వాలి. ఈ వేప నీటితో ఉదయాన్నే తలను శుభ్రం చేసుకోవడం వల్ల తలలో చుండ్రు ద్వారా వచ్చిన దురద తగ్గిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here