అందమైన ,ఒత్తైన జుట్టు కోసం కరివేపాకుతో ఇలా చేసి చూడండి

0
1

అందమైన ,ఒత్తైన జుట్టు కోసం కరివేపాకుతో ఇలా చేసి చూడండి

ప్రస్తుతం అందరు(పురుషులు,స్త్రీలు) ఎదుర్కొంటున్న  మొదటి సమస్య జుట్టు రాలడం .అధిక కాలుష్యం వలన ఈ సమస్య అధికంగా ఉంది. కానీ ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యల నుండి బయట పడటం చాలా కష్టంగా మారింది. ఆరోగ్యమైన,బలమైన జుట్టు కోసం ఈ చిట్కాలను పాటించి చూడండి.
మనకి ఎక్కువ అందుబాటులో ఉండే వంటింటి పదార్ధాలలో  కరివేపాకు ఒకటి. కరివేపాకు జుట్టుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం.

1. కరివేపాకుతో కొబ్బరి నూనె

మనం రోజువారీ ఆహరం లో తెసుకునే కరివేపాకు మన జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకు కొబ్బరి నూనె కలిస్తే జుట్టు పెరుగుదలలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఒక గిన్నెలో కరివేపాకు,కొబ్బరి నూనె వేసి కరివేపాకు నల్లగా అయ్యేవరకు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద నుంచి దించి చల్లారాక జుట్టుకు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా వారానికి రెండు సార్లు ఒక నెల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

2. కరివేపాకు మరియు పెరుగు మిశ్రమం

కరివేపాకు పెరుగు మిశ్రమం జుట్టుకి మంచి పోషణ అందిస్తుంది.మొదట కొంత  కరివేపాకును తీసుకొని  మెత్తని పేస్ట్ గాచేయాలి.అరకప్పు పేస్ట్ లో మూడు స్పూన్ల పెరుగును వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాతషాంపూతో తలస్నానం చేయాలి. మెరుస్తుంది.పెరుగు జుట్టుకి మంచి కండిషనర్ గా పనిచేస్తుంది. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే జుట్టు రాలడం సమస్యను అధిగమించవచ్చు.జుట్టు పెరగడమే కాకుండా, అందంగా ,ఒత్తుగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here