ముఖంపై మొటిమలు ,నల్లమచ్చలు నివారించడానికి చిట్కాలు

0
2

ముఖంపై మొటిమలు ,నల్లమచ్చలు నివారించడానికి చిట్కాలు

మొటిమలు రావడం వలన మీ ముఖముపై నల్ల మచ్చలు ఏర్పడతాయి.  సూర్యరశ్మి మీ చర్మం మీద ఎక్కువగా పడటం వలన కూడా నల్ల మచ్చలు ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన మచ్చలను, ఈ క్రింది  చెప్పిన చిట్కాలను పాటించడం వలన మొటిమలు వాటివల్ల కలిగే మచ్చల నుంచి విముక్తి చెందవచ్చు.

టమాటో

ఒక టమాటోని తీసుకొని పేస్టు చేసి టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషముల తరువాత వేడి నీటితో కడగాలి.

ఉల్లిపాయ

ఉల్లిపాయలో సూక్ష్మజీవ నిరోధక లక్షణాలు ఎక్కువగా ఉన్నవి, అందువలన ఇది మొటిమలను వాటి మచ్చలను తొలగించుటకు ఉపయోగపడుతుంది. ఒక ఉల్లిపాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసి, మిక్సర్ సహాయంతో పేస్టు చేయాలి. తరువాత ఆ పేస్టు నుంచి నీటిని వడపోసి పిప్పిని మాత్రమే ముఖానికి అప్లై చేసి కొన్ని నిమిషముల తరువాత ముఖాన్ని నీటితో కడగాలి.

పసుపు మరియు నిమ్మరసం

చిటికెడు పసుపు తీసుకుని దానిలోకి నిమ్మరసాన్ని కలిపి పేస్టు తయారు చేయాలి. ఆ పేస్టుని ముఖానికి అప్లై చేసి నీటితో కడగాలి. ఇలా చేయడం ద్వారా తొందరగా మీ ముఖముపై మచ్చలు తొలగిపోతాయి. ఇలా రోజు చేయడం వలన మీరు ఇంకా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here