మెగా ఫామిలీ రేర్  ఫోటో :  ట్వీట్  చేసిన పవర్ స్టార్ 

0
8

మెగా ఫామిలీ రేర్  ఫోటో :  ట్వీట్  చేసిన పవర్ స్టార్

జనసేన అధినేత  పవర్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా  యాక్టీవ్ గా ఉంటారు . సమాజంలో  జరిగే సంఘటనల పై పవన్ ఎప్పుడు స్పందిస్తోంటారు . తాజాగా పవర్ స్టార్  తన పర్సనల్ లైఫ్ గురించి ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు.

పవన్ కళ్యాణ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తన చిన్నతనంలో దిగిన ఓ ఫోటోను గురువారం (జులై 5) ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

బ్లాక్ అండ్ వైట్‌‌లో ఉన్న ఈ ఫోటోలో పవన్ తన తోబుట్టువులతో కలిసి ఉన్నారు. ఈ ఫోటో గురించి పవన్ వివరిస్తూ.. అది నెల్లూరులో తీసుకున్న ఫొటో అని, అప్పుడు తాను ఏడో తరగతి చదువుతున్నాని చెప్పారు. చాలాకాలం బ్రాంకైటిస్‌తో బాధపడి.. కోలుకున్న తర్వాత తీసుకున్న ఫోటో అది అని పవన్ వివరించారు.

 

ఆ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, అక్క మాధవీరావు, చెల్లెలు విజయదుర్గ ఉన్నారు. ప్రస్తుతం ఈ  ఫోటో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.మెగా బ్రదర్స్ రేర్  పిక్ అంటూ  అభిమానులు  షేర్ చేస్తూ , కామెంట్స్ పెడుతున్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here