నితిన్ ” శ్రీనివాస కళ్యాణం” విడుదల తేదీ ఖరారు

0
13

నితిన్ ” శ్రీనివాస కళ్యాణం” విడుదల తేదీ ఖరారు

ప్రముఖ నిర్మాణ‌ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్ రాజు నిర్మాతగా ,  శతమానం భవతి సినిమాతో ఘనవిజయం సాధించిన సతీష్ వేగేశ్న  దర్శకత్వంలో  నితిన్‌ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం  “శ్రీనివాస కళ్యాణం” .  కుటుంబ కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తి కావచ్చింది.

ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ  చిత్రయూనిట్ రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను విడుదల చేసింది . ఆగస్టు 9న  సినిమా విడుదలకు   ముహూర్తం ఫిక్స్‌ చేశారు .నితిన్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా, నందిత శ్వేత హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ సంగీతమందిస్తున్నారు.

 

14 ఏళ్ల క్రితం  దిల్ రాజు,  నితిన్ కాంబినేషన్లో వచ్చిన  సినిమా  ‘దిల్’ . వీరి కాంబినేషన్  లో వచ్చిన ఈ చిత్రం  ఎంత సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్  రాజ్ కూడా నటించారు .మరల ఇన్ని సంవత్సరాలకు వీరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుంది .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here